
దేశ రాజధాని ఢిల్లీలో యాక్టివ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత మార్చి 31 నుంచి మొదటిసారి యాక్టివ్ కేసుల సంఖ్య పదివేల దిగువకు చేరింది. దిల్లీలో ప్రస్తుతం 9,364 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 576 కేసులే నమోదయ్యాయి. కానీ మరణాలు మాత్రం భారీగానే సంభవిస్తున్నాయి. 24 గంటల్లో 103 మంది మృతిచెందారు. వరుసగా మూడో రోజూ పాజిటివిటీ రేటు ఒక శాతానికి దిగువనే నమోదైంది. బుధవారం పాజిటివిటీ రేటు 0.78 శాతంగా ఉంది.