
రాష్ట్రంలో జూలై 1 నుంచి ప్రారంభమయ్యే పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమం పై ముఖ్మమంత్రి కె. చంద్రశేఖరరావు అధ్యక్షతన శనివారం ప్రగతి భవన్ లో సమావేశం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఈ సమావేశంలో మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించేందుకు అధికారులు అంకిత భావంతో కృషి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. సమావేశంలో మరికొన్ని కీలక అంశాలపై చర్చించనున్నారు.