
సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రి వర్గం సమావేశం ప్రారంభమైంది. ప్రగతి భవన్ లో జరిగే ఈ సమావేశానికి మంత్రులు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వేతన సవరణ ఫైల్ కు రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉన్నది. ఉద్యోగుల వేతన సవరణపై చర్చించనున్నట్లు సమాచారం. కరోనా పరిస్థితి. లాక్ డౌన్ అమలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై ఎలాంటి ప్రభావం చూపింది. తీసుకోవాల్సిన చర్యలేంటి తదితర అంశాలపై సమావేశంలో చర్చించి మంత్రి వర్గం తగిన నిర్ణయాలు తీసుకోనున్నది.