Water heater : ముందే చలికాలం ఉదయం లేవడం చాలా బద్దకం. లేస్తే వెంటనే ఫ్రెష్ అవ్వాలి. లేదంటే అమ్మ తిడుతుంది. ఆఫీస్ కు లేట్ అవుతుంది. పొలం పనులకు వెళ్లాలి. ఇలా కొందరివి కొన్ని సమస్యలు. మొత్తం మీద ఫ్రెష్ అవ్వాలంటే వేడి నీరు కావాలి. చలికాలంలో వేడి నీరుతో స్నానం చేస్తే ఆ కిక్కే భలే ఉంటుంది కదా. అందుకే, చాలా మంది వేడినీటితో స్నానం చేస్తారు. గతంలో నీరును వేడి చేయడానికి ఎక్కువగా కట్టెల పొయ్యిని ఉపయోగించేవారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి గ్రామాల్లో కూడా కనిపించడం లేదు. మొత్తం మీద కాలం మారింది. ఇప్పుడు దీనికోసం గీజర్స్ వచ్చాయి. హీటర్లు వచ్చాయి. స్విచ్ వేస్తే చాలు నిమిషాల్లో వేడివేడి నీరు మీ ముందు ఉంటుంది. అయితే గ్లీజర్ కాస్తా ఖర్చుతో కూడుకున్న పని. అందుకే, ఎక్కువమంది వాటర్ హీటర్స్‌కు ఓటు వేస్తున్నారు. తక్కువధరకే రావడంతో చాలా మందికి నచ్చేస్తుంది. అంతా బానే ఉన్నా… దీనిని వాడేటప్పుడు జాగ్రత్తలు చాలా అవసరం. లేదంటే ప్రాణాలకు కరెంట్ కు అర్పించాల్సిందే. మరి ఈ హీటర్ పెట్టినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం.
కొంతమంది వాటర్ హీటర్ ప్లగ్‌ను కరెంట్ బోర్డులో పెట్టి ఆ తర్వాత బకెట్‌లో పెడుతుంటారు. ఇలా ఎప్పుడు చేయొద్దు. ముందుగా బకెట్‌లో పెట్టి ఆ తర్వాత ప్లగ్‌లో పెట్టాలి. ఆ తర్వాత మాత్రమే స్విచ్ ఆన్ చేయాలి. నీరు వేడి అయ్యాక స్విచ్ ఆఫ్ చేసి వాటర్ మీటర్ బయటికి తీయాలి. ఆ తర్వాత బకెట్‌ని ముట్టుకోవాలి. అప్పటి వరకు ముట్టుకోవద్దు.
ఏ బకెట్స్‌లో పడితే ఆ బకెట్స్‌లో వాటర్ హీటర్ పెట్టవద్దు. లేదంటే ప్రాబ్లం అవుతుంది. అల్యూమినియం బకెట్ మాత్రమే వాడండి. అంతేకానీ, ప్లాస్టిక్, ఇనుప బకెట్స్ వినియోగించవద్దు. ప్లాస్టిక్ వాడితే అది కరిగిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇనుప బకెట్స్‌కి కరెంట్ షాక్ వస్తుంది కాబట్టి వీటిని అవైడ్ చేయండి.
వాటర్ హీటర్ వాడుతుంటే కచ్చితంగా ధ్యాసం దానిమీదే ఉండాలి. ఎప్పుడు ఆన్ చేయాలి. ఎప్పుడు ఆఫ్ చేయాలో పూర్తిగా గుర్తు పెట్టుకొండి. పూర్తిగా పవర్ ఆఫ్ చేసిన తర్వాత వాటర్ వేడి అయ్యాయా లేదో చెక్ చేయండి. పొరపాటున మర్చిపోయి కూడా ప్లగ్ ఉన్నప్పుడు వేలు పెట్టవద్దు. లేదంటే మీ పని అంతే ఇగ.
పిల్లలు ఉంటే మరింత జాగ్రత్త అవసరం. లేదంటే చాలా ప్రమాదం ఫేస్ చేయాల్సి వస్తుంది. వాటర్ హీటర్‌ని ఎక్కడపడితే అక్కడ కాకుండా పిల్లలు వెళ్లని ప్రదేశంలో పెట్టడం చాలా అవసరం. వారు ఆడుతూ ఆడుతూ ఆ వాటర్ లో వేలు పెట్టే అవకాశం ఉంటుంది. వీలైతే ఆ రూమ్ తలుపు వేయడం మరింత మంచిది. దీంతో ఎలాంటి ప్రమాదం ఉండదు. అదే విధంగా, స్విచ్ వేశాక అటు వైపు ఎవరు వెళ్ళకుండా జాగ్రత్త పడండి. ఈ టెన్షన్ ఎందుకండీ హ్యాపీగా స్టవ్ మీద పెట్టుకోవచ్చు కదా.
హీటర్ పెట్టినప్పుడు వాటర్ లెవల్ ఎలా చూడాలనే విషయం సరిగా తెలియదు. కానీ, ఎప్పుడు కూడా బకెట్‌లో నీరు ఎంతవరకూ ఉంచాలనేది వాటర్ హీటర్‌పైనే ఉంటుంది చూసి అంత పరిమాణంలోనే ఉంచాలి. హీటింగ్ కాయిల్ పూర్తిగా మునిగేలా వాటర్ పోయండి.