https://oktelugu.com/

Horoscope Today: కర్కాటక తో సహా ఈ రాశుల వారికి ఈ రోజు శుభ ఫలితాలు.. వద్దన్నా డబ్బు..

అప్పులు తీర్చడంతో రుణభారం తగ్గుతుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం పై శ్రద్ధ పెడతారు. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వ్యాపారాలు కొత్త పెట్టుబడులు పెడతారు.

Written By:
  • NARESH
  • , Updated On : November 20, 2024 / 08:11 AM IST

    Horoscope Today

    Follow us on

    Horoscope Today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై ఉషా నక్షత్ర ప్రభావం ఉండనుంది. ఇదే సమయంలో చంద్రుడు కర్కాటక రాశిలో సంచరించనున్నాడు. దీంతో కర్కాటక తో సహా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు జరగనున్నాయి. మరికొన్ని రాశుల వారు ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటారు.

    మేష రాశి: ఈ రాశి వ్యాపారులు అపారమైన లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యుల సలహాతో కొత్త పెట్టుబడులు పెడతారు. వివాహానికి అర్హులైన వారికి ప్రతిపాదనలు వస్తాయి. దీంతో ఇంట్లో సందడిగా ఉంటుంది.

    వృషభ రాశి: కుటుంబ బాధ్యతలను పూర్తి చేస్తారు. కొన్ని పెండింగ్ పనులు నేటితో పూర్తవుతాయి. వాగ్వాదాలకు దూరంగా ఉండటం మంచిది కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఉంటాయి. అయితే సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలి.

    మిథున రాశి: ఉద్యోగులు చేపట్టిన లక్ష్యాన్ని నేటితో పూర్తి చేస్తారు. దీంతో ఉల్లాసంగా ఉంటారు. కుటుంబ సభ్యులు సైతం వీరికి మద్దతు ఇస్తారు. విద్యార్థుల కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటారు. భవిష్యత్తులో లాభాలు వచ్చే పెట్టుబడులు పెడతారు.

    కర్కాటక రాశి: సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనుకోని ప్రయాణాలు ఉంటాయి. ఇవి లభిస్తాయి. జీవిత భాగస్వామి సలహాతో వ్యాపారులు కొన్ని పెట్టుబడులు పెడతారు. కుటుంబంతో సంతోషంగా ఉంటారు.

    సింహారాశి: కుటుంబంలో కొన్ని చెక్కులు ఏర్పడతాయి. ప్రియమైన వారి సలహాతో ఇవి పరిష్కారం అవుతాయి. విద్యార్థులు పరీక్ష లో పాల్గొన్నట్లయితే విజయం సాధిస్తారు. ఉద్యోగులు గమ్యాన్ని చేరడంతో పదోన్నతి పొందే అవకాశం ఉంటుంది.

    కన్య రాశి: వ్యాపార అభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. బంధువుల నుంచి ఆర్థిక సహాయం అందుతుంది. స్నేహితులతో సరదాగా ఉంటారు. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. వీరితో జాగ్రత్తగా ఉండాలి.

    తుల రాశి: ఈ రాశి వారికి ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి. కుటుంబంలో సమస్యలు ఎదురయ్యే అవకాశం. వ్యాపారులకు నష్టాలు ఉండే అవకాశం. ఉద్యోగులు ఒత్తిడిని ఎదుర్కొంటారు.

    వృశ్చిక రాశి: ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు. విద్యార్థులు పోటీ పరీక్షల కోసం ఏకాగ్రత ఉంచుతారు. వ్యాపారులకు ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. ఉద్యోగులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. బంధువుల్లో ఒకరితో వాగ్వాదం ఉంటుంది.

    ధనస్సు రాశి: జీవిత భాగస్వామి సలహాతో వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తారు. వివాహానికి సిద్ధమయ్యే వారికి ఆటంకాలు తొలగిపోతాయి. దీంతో ఇంట్లో సందడి నెలకొంటుంది. ఉద్యోగులు లక్ష్యాన్ని పూర్తి చేయడంతో ప్రశంశాలు అందుతాయి.

    మకర రాశి: ఈ రాశి వారు ఈ రోజు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఇతరుల సలహాతో నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తులో ఇబ్బంది ఉండే అవకాశం. అందువల్ల సొంత నిర్ణయాలు తీసుకోవాలి. జీవిత భాగస్వామితో వాగ్వాదం ఉండే అవకాశం.

    కుంభరాశి: అప్పులు తీర్చడంతో రుణభారం తగ్గుతుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం పై శ్రద్ధ పెడతారు. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వ్యాపారాలు కొత్త పెట్టుబడులు పెడతారు.

    మీనరాశి: కొన్ని పనులు అనుకోకుండా వాయిదా పడతాయి. కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవచ్చు. అన్నదమ్ముల మధ్య గొడవలు వచ్చే అవకాశం. వ్యాపారానికి కొన్ని చిక్కలు ఎదురవుతాయి. ఉద్యోగులు అనుకున్న పనులు పూర్తి చేస్తారు.