Homeజాతీయం - అంతర్జాతీయంBCCI: క్రికెటర్లకు గుడ్ న్యూస్ చెప్పిన బీసీసీఐ.. వారికి ఇకపై భారీగా జీతాలు

BCCI: క్రికెటర్లకు గుడ్ న్యూస్ చెప్పిన బీసీసీఐ.. వారికి ఇకపై భారీగా జీతాలు

బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కీలమైన నిర్ణయాలు తీసుకున్నారు. దేశవాలీ క్రికెటర్ల వేతనాలు భారీగా పెంచుతూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. దుబాయ్ లో సోమవారం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు  భారత్ క్రికెట్ నియంత్రణ మండలి కార్యదర్శి జై షా శుభవార్త చెప్పారు. 2019-20 సీజన్ కు గానూ ఆటగాళ్లందరికీ 50 శాతం మేర అదనంగా మ్యాచ్ ఫీజు చెల్లించనున్నట్లు పేర్కొన్నారు.

కోవిడ్ కారణంగా 2020-21 సీజన్ జరిగిన ఆర్థిక నష్టానికి పరిహారంగా ఈ మేరకు అదనపు ఫీజు చెల్లించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఆదే విధంగా దేశవాళీ క్రికెటర్లు మ్యాచ్ ఫీజులు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. 40 మ్యాచ్ లకు పైడా ఆడిన సీనియర్లకు రూ, 60 వేలు, అండర్ -23 ప్లేయర్లకు 25వేలు, అండర్ 19 క్రికెటర్లకు 20 వేలు చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో గతేడాది జరగాల్సిన దేశవాళీ సహా వివిధ క్రికెట్ టోర్నీలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. వ్యాక్సినేషన్ వేగవంతం కావడం కోవిడ్ పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఈ ఏడాది ఆరంభం నుంచి పలు క్రీడా ఈవెంట్లు మొదలయ్యాయి.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular