
సీఎం జగన్ పై బీసీ సంఘాల నేతలు ఫైర్ అయ్యారు. పాదయాత్రలో ఇచ్చిన హామీల అమలులో జగన్ విఫలమయ్యారన్నారు. జగన్ సీఎం అయితే కష్టాలు తీరుతాయని నమ్మి బడుగులంతా ఓట్లు వేశారన్నారని, కానీ వారి నమ్మకాన్ని వమ్ము చేశారన్నారు. త్వరలోనే బీసీల ఆధ్వర్యంలో రాజకీయ పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు ప్రకటించారు. నగరంలో ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్రం నలుమూలల అభిప్రాయాలు సేకరిస్తున్నామన్నారు. జూలై 2న కలెక్టరేట్ ల ఎదుట నిరసనకు పిలుపునిచ్చారు.