Bangalore: నదులు పిల్ల కాలువలను తలపిస్తున్నాయి. చెరువులు ఎండిపోయాయి. పంట పొలాలు ఎడారులను తలపిస్తున్నాయి. సామాన్యులే కాదు ముఖ్యమంత్రి నివాసంలో బోరు ఎండిపోయింది. తాగేందుకు నీరు లేక.. ఆ నీరు దొరికే మార్గం లేక చుక్కలు కనిపిస్తున్నాయి. క్యాన్ నిండా తాగునీరు తెచ్చుకోవాలంటే గంటల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడి ప్రభుత్వం కట్టదిట్టమైన చర్యలు తీసుకుంది. ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లకు నిబంధనలు దించింది. రేట్లు పెంచితే చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇదీ ప్రస్తుతం బెంగళూరు నగరంలో నెలకొన్న పరిస్థితి.
ప్రభుత్వం ఎన్ని నిబంధనలు విధించినప్పటికీ అక్కడ కొంతమంది వ్యవహార శైలి మారడం లేదు. గుక్కెడు నీటి కోసం అక్కడి ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో.. కొంతమంది తమకేమీ పట్టనట్టు.. తాగునీటి కష్టాలు అసలే లేనట్టు వ్యవహరించారు.. తమ కార్లను నీటితో కడిగారు. దీనికోసం లీటర్ల కొద్ది నీటిని వృధా చేశారు. అయితే ఈ విషయం గుర్తించిన బెంగళూరు నగరపాలక సంస్థ అధికారులు 22 మందికి 5000 చొప్పున లక్ష పదివేలు అపరాధ రుసుం విధించారు. మరోసారి ఇలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు..
బెంగళూరులో నెలకొన్న తాగునీటి ఎద్దడిని దృష్టిలో పెట్టుకొని ఇటీవల అక్కడి ప్రభుత్వం తెరపైకి సరికొత్త నిబంధనలను తీసుకొచ్చింది. తాగునీటిని వృధా చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని పురపాలక శాఖ అధికారులను ఆదేశించింది. కార్లు, ద్విచక్ర వాహనాలను కడిగితే అపరాధ రుసుం విధించాలని కోరింది. ప్రభుత్వ నిర్ణయంతో బెంగళూరు పురపాలక అధికారులు సరికొత్త నిబంధనలను తెరపైకి తీసుకువచ్చారు. నీటి కరవు నెలకొన్న నేపథ్యంలో వాటిని అమలు చేయడం మొదలుపెట్టారు. ఆయనప్పటికీ అక్కడ కొందరి వ్యవహార శైలి మారడం లేదు. అక్కడ తాగునీటి ఎద్దడి నెలకొన్న నేపథ్యంలో బెంగళూరులో నిర్వహించే ఐపీఎల్ పోటీలపై సందిగ్ధం నెలకొంది. తాగునీటి కరువు నేపథ్యంలో ప్రాజెక్టులు లేదా ఇతర నీటి వనరుల నుంచి శుద్ధి చేసిన నీటిని తాము సరఫరా చేయబోమని.. కబ్బన్ ప్రాంతంలోని మురుగునీటి నుంచి శుద్ధి చేసిన నీటిని మాత్రమే సరఫరా చేస్తామని బెంగళూరు పురపాలక శాఖ అధికారులు స్పష్టం చేశారు. దీంతో కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఆ ప్రతిపాదనకు ఓకే చెప్పింది. ఫలితంగా సోమవారం నాటి బెంగళూరు, పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ కు మురుగు నీటి నుంచి శుద్ధి చేసిన నీటిని బెంగళూరు పురపాలక శాఖ సరఫరా చేసింది.
అసలే నీటికి కరువు ఉందంటే వినకుండా కార్లు కడుగుతున్న 22 మంది బెంగళూరు వాసులకు ఫైన్!
బెంగళూరులో తాగునీటికి రోజురోజుకు ఇబ్బందిగా ఉంటే కార్లు కడుగుతున్న 22 మందిని గుర్తించి రూ. 5000 చొప్పున మొత్తం రూ. 1.10 లక్షలు ఫైన్ వేసిన బెంగళూరు వాటర్ సప్లయ్ అధికారులు. pic.twitter.com/hbC7gBVAFr
— Telugu Scribe (@TeluguScribe) March 26, 2024