
సీఎం కేసీఆర్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాశారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 17న రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ జెండా ఎగురవేయించాలని కోరారు. రజాకార్ల చేతిలో బలైన కుటుంబాలకు ప్రభుత్వం సన్మానం చేయాలన్నారు. తెలంగాణ విమోచన పోరాట చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.