
పలు పథకాల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం నిధులు పంపుతుంటే.. సీఎం కేసీఆర్ తన ఫొటోలు పెట్టుకుని ప్రచారం చేసుకుంటున్నారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన మొయినాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద కేంద్ర 70 వేల ఇళ్లు, 198 కోట్ల నిధులను మంజూరు చేసిందని గుర్తు చేశారు. అలాగే రంగారెడ్డి జిల్లా అభివృద్ధికి రూ. 1,040 కోట్లు ఇచ్చిందని పేర్కొన్నారు. రోడ్లు, కరోనా వ్యాక్సిన్, బియ్యం, హరితహారం ఇలా ప్రతి దానికి పైసలు కేంద్రమే ఇస్తుందని తెలిపారు.