
కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు వీకెండ్ లాక్ డౌన్ లు విదించగా, వైరస్ తీవ్రంగా ఉన్న రాష్ట్రాలు కంప్లీట్ లాక్ డౌన్ లు విధిస్తున్నాయి. అందులో భాగంగా రకరకాల కార్యకలాపాలపై రకరకాల ఆంక్షలు విధిస్తున్నాయి. ఒడిశాలో కూడా ఇప్పటికే లాక్ డౌన్ అమల్లో ఉండగా ఇప్పుడు ఆ ఆంక్షలను మరింత కఠిన తరం చేస్తున్నట్లు ఒడిశా సర్కారు ప్రకటించింది. తదుపి ఉత్తర్వులు జారీ చేసే వరకు రాష్ట్రంలో ఇండోర్, ఔట్ డోర్ సహా అన్ని రకాలు సినిమా, సిరియల్ షూటింగ్ లపై నిషేధం విధిస్తున్నట్లు తెలిపింది.