spot_img
Homeఅంతర్జాతీయంBalen Shah Nepal Prime Minister : నేపాల్‌ కాబోయే ప్రధానికి చదువు చెప్పింది మనమే..!

Balen Shah Nepal Prime Minister : నేపాల్‌ కాబోయే ప్రధానికి చదువు చెప్పింది మనమే..!

Balen Shah Nepal Prime Minister : నేపాల్‌ పార్లమెంటు ఎన్నికలు ముగిశాయి. ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. బ్యాలెకట్‌ పద్ధతిలో పోలింగ్‌ నిర్వహించడంతో కౌంటింగ్‌ ఆలస్యం అవుతోంది. ఇప్పటి వరకు అందిన ఫలితాల ప్రకారం… జెన్‌ జీ ఉద్యమనేత బాలెన్‌ షా నేతృత్వంలోని ఆర్‌ఎస్‌పీ పార్టీ 104 సీట్లు గెలిచింది. ప్రభుత్వం ఏర్పాటుకు 165 స్థానాలు కావాలి. ఆర్‌ఎస్‌పీ ప్రస్తుతం మరో 21 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. మొత్తంగా 130 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. కలిసి వచ్చే పార్టీలతోకలిసి బాలెన్‌షా ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారు. ఆదివారం సాయంత్రానికి ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

భారత్‌లో షా విద్యాభ్యాసం..
ఇదిలా ఉంటే.. బాలెన్‌షా గతేడాది జెన్‌జీ ఉద్యమం ద్వారా వెలుగులోకి వచ్చాడు. యువ నాయకుడు నేపాల్‌లో అధికారంలో ఉన్న నేతలు, వారి పిల్లలు అనుభవిస్తున్న రాజభోగాలకు వ్యతిరేకంగా ఉద్యమించాడు. అయితే బాలెన్‌ షా భారత్‌లోని బెంగళూరులోని విశ్వేశ్వరయ్య టెక్నికల్‌ యూనివర్సిటీలో ఉన్నత విద్య అభ్యసించాడు. జెన్‌జీ ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ ఎన్నికల్లో సంప్రదాయ పార్టీలకు షాక్‌ ఇచ్చాడు

ప్రారంభ జీవితం
1990 ఏప్రిల్‌లో బాలెంద్ర షా(బాలెన్‌) కాఠ్మాండులో పెరిగాడు. స్ట్రక్చరల్‌ ఇంజినీరింగ్‌లో డిగ్రీ తర్వాత రాప్‌ సంగీతంతో యువతను ఆకట్టుకున్నాడు. అవినీతి వ్యతిరేక పాటలు, స్వతంత్ర దృక్పథంతో సోషల్‌ మీడియాలో లక్షలాది ఫాలోవర్లు సంపాదించాడు. 2016–18 మధ్య బెంగళూరులోని విశ్వేశ్వరయ్య టెక్నికల్‌ యూనివర్సిటీలో ఎంటెక్‌ పూర్తి చేశాడు. భారత విద్యా వ్యవస్థ ఆయన సాంకేతిక, ఆలోచనా సామర్థ్యాన్ని బలోపేతం చేసింది.

2022లో రాజకీయ ప్రవేశం..
2022లో కాఠ్మాండు మేయర్‌గా స్వతంత్రంగా గెలిచి అక్రమ ఆక్రమణలు, రోడ్లు, నీటి సమస్యలపై కఠిన చర్యలు తీసుకున్నాడు. ఇప్పుడు రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ఆధ్వర్యంలో జాతీయ స్థాయికి ఎదిగాడు. ఆయనకు ఇన్‌స్టాగ్రామ్‌లో 10 లక్షల మందికిపైగా ఫాలోవర్లు ఉన్నారు.

ఎన్నికల ఫలితాలు ఇలా..
మార్చి 5న జరిగిన ఎన్నికల్లో ఆర్‌ఎస్‌పీ అధికార పీఠం దిశగా ముందుకు సాగుతోంది. జాపా నుంచి పోటీ చేసిన బాలెన్‌ 68,348 ఓట్ల రికార్డు మెజారిటీతో గెలిచాడు. మాజీ ప్రధాని కేపీ. శర్మ ఓలిని 49,614 ఓట్ల తేడాతో ఓడించాడు. బాలెన్‌ జాతీయవాది గ్రేటర్‌ నేపాల్‌ మ్యాప్‌తో కాలాపానీ, లిపులేఖ్‌ వివాదాలు లేవనెత్తాడు. అయితే సమతుల్య విదేశాంగ విధానం, ఓపెన్‌ బోర్డర్‌ వాణిజ్యం, జలవిద్యుత్‌ ప్రాజెక్టులు, అగ్నివీర్‌ సమస్యల పరిష్కారానికి అవకాశాలు ఉన్నాయి.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper