
హైదరాబాద్ నగరంలో తొలిసారి ఆరు వరుసలతో నిర్మించిన బాలానగర్ ఫ్లై ఓవర్ ను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. సుమారు రూ. 385 కోట్ల వ్యయంతో మూడన్నరేళ్ల వ్యవధిలో బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేశారు. 2017 ఆగస్టు 21న కేటీఆర్ దీనికి శంకుస్థాపన చేశారు. 1.13 కిలోమీటర్ల పొడవు 24 మీటర్ల వెడల్పుతో 26 పిల్లర్లతో ఈ వంతెన నిర్మించారు. ప్రారంభోత్సవంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి పాల్గొన్నారు.