
కరోనా కట్టడికి రాష్ట్రంలోని 11 జిల్లాల్లో ఈనెల 21 వరకు లాక్ డౌన్ పొడిగించాలని కర్నాటక ప్రభుత్వం గురువారం నిర్ణయించింది. చిక్మగళూర్, శివమొగ్గ, దావణగెరె, మైసూర్, చామారాజనగర్, హసన్, దక్షిణ కన్నడ, బెంగళూర్ రూరల్, మాండ్య, బెల్గావి, కొడుగు జిల్లాల్లో ఈ నెల 21 వరకు పూర్తి లాక్ డౌన్ అమల్లో ఉంటుందని ఆరోగ్య మంత్రి కే సుధాకర్ వెల్లడించారు.