
ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి డ్రైవర్, పీఏపై అవినీతి నిరోదక శాఖ ప్రత్యేక న్యాయస్థానం బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. సాక్షులుగా విచారణకు హాజరుకావాలని ఓటుకు నోటు కేసు సమయంలో రేవంత్ రెడ్డితో సన్నిహితంగా ఉన్న ఆయన డ్రైవర్ రాఘవేందర్ రెడ్డి, వ్యక్తిగత సహాయకుడు సైదయ్యకు న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. సమన్లు తీసుకున్నప్పటికీ ఇవాళ విచారణకు గైర్హాజరు కావడంతో ఇద్దరికీ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఆగస్టు 9న హాజరుకావాలని స్పష్టం చేసింది.