
భాజపా నేత, కేంద్ర మాజీ మంత్రి బాబుల్ సుప్రియో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతాలో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. ఇకపై సామాజిక సేవపై దృష్టిపెట్టనున్నట్లు తెలిపారు. కేంద్ర మంత్రివర్గం నుంచి బాబుల్ ను తొలగించిన కొద్ది రోజులకే ఆయన ఈ తీసుకోవడం గమనార్హం. ప్రముఖ గాయకుడైన బాబుల్ సుప్రియో 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ ఏడాది పశ్చిమ బెంగాల్ లోని అసన్సోల్ నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు.