జూనియర్ ఎన్టీఆర్ సడెన్ గా రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి ఎమ్మార్వో ఆఫీస్ కి ఎందుకు వెళ్లినట్టు ? అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. అయితే ఎన్టీఆర్ శంకర్ పల్లిలో స్థానికంగా రెండు ఎకరాల భూమి కొనుగోలు చేశారు. ఆ భూమి తాలూకు రిజిస్ట్రేషన్ కోసమే ఎన్టీఆర్ స్వయంగా శంకర్ పల్లి ఎమ్మార్వో ఆఫీస్ కు వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే, తమ ఆఫీస్ లో ఎన్టీఆర్ ను చూసిన అక్కడి సిబ్బంది తెగ ఉత్సాహ పడ్డారు.
పనిలో పనిగా అక్కడ ఉన్న సిబ్బంది మరియు ఎమ్మార్వో అంతా ఎన్టీఆర్ తో సరదాగా ఫొటో కూడా దిగారు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇక ఎన్టీఆర్ కూడా అక్కడి సిబ్బందితో కాసేపు సరదగా ముచ్చట్లు పెట్టారట. నిజానికి తన రిజిస్ట్రేషన్ పక్రియ చూసుకుని నేరుగా వెళ్లి పోయే అవకాశం ఉన్నా.. తన చుట్టూ చేరిన జనం కోసం ఆయన వారితో మాటలు కలిపారు.
ఇక ఎన్టీఆర్ శంకర్ పల్లి ఎమ్మార్వో ఆఫీస్ కి వచ్చాడని తెలిసి.. తారక్ అభిమానులు అక్కడికి పెద్ద ఎత్తున వచ్చారు. తారక్ తో సెల్ఫీలు తీసుకునేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఇక ఎన్టీఆర్ ఒక వైపు ఆర్‌ఆర్ఆర్ సినిమా షూటింగ్ తో పాటు మరో వైపు ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోతో కూడా ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో దాదాపు పూర్తి అయినట్లు తెలుస్తోంది.
ఇక త్వరలోనే దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్న సినిమాను కూడా స్టార్ట్ చేసేందుకు ఎన్టీఆర్ రెడీ అవుతున్నాడు. ఎలాగూ ఎన్టీఆర్ కి ఆర్ఆర్‌ఆర్ సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ వస్తోంది కాబట్టి.. ఆ రేంజ్ కి తగ్గట్టు కొరటాల సినిమాని ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఆర్ఆర్ఆర్ లో కొమురం భీమ్ గా ఎన్టీఆర్ కనిపించబోతున్న సంగతి తెలిసిందే.