Kalki 2898 AD sequel : ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీ లో ‘కల్కి 2898 AD’ అనే చిత్రం ఒక చరిత్ర. మన పురాణం ఇతిహాసాలకు, సైన్స్ ఫిక్షన్ ని జోడించి, అద్భుతమైన విజన్ తో తెరకెక్కించిన నాగ అశ్విన్ ని ఎంత మెచ్చుకున్నా తక్కువే. విజన్ ఉండడం వేరు , దానిని వెండితెర పై ఆవిష్కరించడం వేరు. ఎక్కడా వెనక్కి తగ్గకుండా, స్క్రిప్ట్ పేపర్ మీద ఏదైతే రాసుకున్నాడో, దానిని మక్కీకి మక్కి దింపి తెరకెక్కించాడు కాబట్టే ఆ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్ బ్రహ్మరథం పట్టి వెయ్యి కోట్ల గ్రాస్ వసూళ్లను అందించారు. ఓటీటీ టెలికాస్ట్ లో కూడా సెన్సేషనల్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది ఈ చిత్రం. కచ్చితంగా సీక్వెల్ ని డిమాండ్ చేసే కాన్సెప్ట్ ఈ చిత్రం లో ఉంది. కానీ ఇప్పటి వరకు ఈ సీక్వెల్ సెట్స్ మీదకు వెళ్ళకపోవడం పై అభిమానుల్లో అసంతృప్తి ఉండేది.
కానీ ఇప్పుడు అభిమానుల ఎదురు చూపులకు తెరపడింది. వచ్చే నెల నుండి ‘కల్కి 2’ రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతుంది. ప్రభాస్ ఫిబ్రవరి మొదటి వారం లో ఈ సినిమా కోసం డేట్స్ ని కేటాయించాడు. ఒక వారం రోజుల పాటు ఈ షెడ్యూల్ సాగనుంది. ఇక ఆ తర్వాత మిగిలిన నటీనటులపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారట. మొదటి భాగం లో కేవలం 7 నిమిషాలు మాత్రమే కనిపించిన కమల్ హాసన్, ఈ సినిమాలో పూర్తి స్థాయిలో కనిపించబోతున్నాడు అట. ఇప్పటికే ఆయనకు సంబంధించిన సన్నివేశాల షూటింగ్ మొత్తం పార్ట్ 1 తెరకెక్కిస్తున్న సమయం లోనే పూర్తి అయ్యింది. ఇతర హీరో సినిమాలో విలన్ క్యారెక్టర్ చేయడం, ఇన్ని దశాబ్దాల కమల్ హాసన్ సినీ చరిత్ర లో ఇదే తొలిసారి. మొదటి భాగం లో కనిపించింది కాసేపే అయినా, ఆడియన్స్ కి అద్భుతమైన అనుభూతిని కలిగించాడు కమల్, ఇక రెండవ భాగం లో ఎలా ఉంటాడో చూడాలి.
ఇకపోతే మొదటి భాగం లో హీరోయిన్ గా నటించిన దీపికా పదుకొనే, రెండవ భాగం లో నటించడం లేదు. ఆమెకు బదులుగా సాయి పల్లవి ని తీసుకునే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. ఒకవేళ సాయి పల్లవి కుదర్శకపోతే అలియా భట్, కీర్తి సురేష్ వంటి హీరోయిన్ల పేర్లను కూడా పరిశీలిస్తున్నారు. నటనకు ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్ కావడం తో, నటి గా నిరూపించుకున్న హీరోయిన్స్ కోసమే వెతుకుతున్నారు మేకర్స్. ఇక మొదటి భాగం లో అశ్వద్దామా క్యారెక్టర్ లో కనిపించిన అమితాబ్ బచ్చన్ , రెండవ భాగం లో కూడా కనిపిస్తాడు. అదే విధంగా అర్జునుడి పాత్రలో మెరిసిన విజయ్ దేవరకొండ కూడా ఈ చిత్రం లో భాగం అయ్యే అవకాశాలు ఉన్నాయి.