MakeMyTrip: వేసవి విహారం.. ఎక్కువగా సెర్చ్‌ చేసిన ప్రదేశాలు ఇవే..!

ఈ ఏడాది మార్చి నుంచి ఏప్రిల్‌ వరకు డేటా ఆధారంగా రూపొందించిన నివేదికను బుధవారం(మే 8న) విడుదల చేశారు. మేక్‌ మై ట్రిప్‌ విడుదల చేసిన డేటా ప్రకారం.. పూరీ, వారణాసి ఎక్కువ మంది సెర్చ్‌ చేసి తీర్థయాత్రల జాబితాలో ఉన్నాయి.

Written By: Raj Shekar, Updated On : May 9, 2024 10:02 am

MakeMyTrip

Follow us on

MakeMyTrip: వేసవి అంటేనే గుర్తొచ్చేది సెలవులు.. తర్వాత విహారం. దాదాపు ప్రతి ఒక్కరూ కుటుంబంతో కలిసి టూర్‌ వెళ్లి రావాలనుకుంటారు. దానికోసం ఏ ప్రాంతం వెళ్తే బాగుంటుందని సెర్చ్‌ చేస్తారు. ఇలా తమ వెబ్‌సైట్‌లో శోధించిన వారిలో అయోధ్య, లక్ష్యద్వీప్, నందీహిల్స్‌ ముందువరుసలో ఉన్నాయని ప్రముఖ ట్రావెల్‌ సంస్థ మేక్‌మై ట్రిప్‌ వెల్లడించింది. గోవాను కూడా ఎక్కువ మంది సెర్చ్‌ చేశారని తెలిపింది.

మార్చి, ఏప్రిల్‌ నెలల డేటా ఆధారంగా..
ఈ ఏడాది మార్చి నుంచి ఏప్రిల్‌ వరకు డేటా ఆధారంగా రూపొందించిన నివేదికను బుధవారం(మే 8న) విడుదల చేశారు. మేక్‌ మై ట్రిప్‌ విడుదల చేసిన డేటా ప్రకారం.. పూరీ, వారణాసి ఎక్కువ మంది సెర్చ్‌ చేసి తీర్థయాత్రల జాబితాలో ఉన్నాయి. ఇక అంతర్జాతీయ ప్రయాణాల విషయానికొస్తే.. బాకు, ఆల్మాటీ, నగోయా ప్రాంతాలను ఎక్కువ మంది శోధించారట. వీటితోపాటు లక్సెంబర్గ్, లంకాని, ఆంటల్యా కూడా ఉన్నాయి.

20 శాతం పెరుగుదల..
గతేడాదితో పోలిస్తే ఫ్యామిలీ ట్రావెల్‌ విభాగం 20 శాతం పెరిగితే, సోలో ట్రావెల్‌ 10 శాతం పెరిగిందని మేక్‌ మై ట్రిప్‌ సంస్థ వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏవసవిలో శోధనలు పెరిగాయని కంపెనీ తెలిపింది.