https://oktelugu.com/

HBD Vijay Devarakonda: సినిమాల్లో రౌడీ.. జీవితంలో రియల్ హీరో.. దేవరకొండ ప్రస్థానమిదీ…

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో తనకంటూ ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ ను క్రియేట్ చేసుకోవడమే కాకుండా నేచురల్ డైలాగ్ డెలివరీ ని చూపిస్తూ ప్రేక్షకులను కట్టి పడేశాడు

Written By:
  • Gopi
  • , Updated On : May 9, 2024 / 10:10 AM IST

    HBD Vijay Devarakonda

    Follow us on

    HBD Vijay Devarakonda: విజయ్ దేవరకొండకి తెలుగు సినిమా ఇండస్ట్రీలో వీరాభిమానులు ఉన్నారు. ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో రాణించాలనే ఉద్దేశ్యం తో వచ్చిన చిన్న చితక క్యారెక్టర్ లను చేసుకుంటూ వచ్చాడు..ఇక శేఖర్ కమ్ముల చేసిన “లైఫ్ ఇజ్ బ్యూటిఫుల్ ” సినిమాలో ఒక గుర్తింపు లేని పాత్ర కూడా చేశాడు… ఇక మొత్తానికైతే ఎన్నో రోజుల నిరీక్షణ తర్వాత పెళ్లిచూపులు అనే సినిమాతో హీరోగా మారాడు. ఇక ఈ మూవీ తో భారీ సక్సెస్ ని సాధించడమే కాకుండా యూత్ లో తనకంటూ ఒక క్రేజ్ ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు.

    ఇక అలాగే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో తనకంటూ ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ ను క్రియేట్ చేసుకోవడమే కాకుండా నేచురల్ డైలాగ్ డెలివరీ ని చూపిస్తూ ప్రేక్షకులను కట్టి పడేశాడు. నిజానికి విజయ్ దేవరకొండ అంటే ప్రతి ఒక్క అభిమానికి విపరీతమైన ఇష్టం ఉంటుంది. అందుకే ఆయన సినిమా చూడడానికి చాలామంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు…ఇక ఇదిలా ఉంటే ఈరోజు విజయ్ దేవరకొండ బర్త్ డే కావడం విశేషం..ఇక ఈయన 1989 మే 9 వ తేదీన జన్మించాడు. ఇక ప్రస్తుతానికి ఆయన 35 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాడు…

    ఇక ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లోనే భారీ సక్సెస్ లను అందుకున్న ఈయన గీతగోవిందం సినిమాతో 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయాడు. ఇక అప్పట్లో ఉన్న టైర్ టు హీరోలెవ్వరికీ సాధ్యం కానీ రీతిలో వరుస సక్సెస్ లను అందుకొని స్టార్ హీరోగా తన రేంజ్ ను పెంచుకుంటూ వస్తున్నాడు. ఇక రీసెంట్ గా చేసిన ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా యావరేజ్ గా ఆడినప్పటికీ ఇప్పుడు మళ్ళీ దిల్ రాజు బ్యానర్ లోనే మరొక సినిమాని చేస్తున్నాడు. అయితే ఈ సినిమాతో తను సక్సెస్ అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇది ఇలా ఉంటే గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో పాన్ ఇండియా మూవీ కూడా చేస్తున్నాడు…

    ఇక ఇది ఇలా ఉంటే ఖుషి సినిమా సమయంలో కష్టాల్లో ఉన్న కుటుంబాలకు తను కోటి రూపాయలని ఒక్కో ఫ్యామిలీ కి లక్ష రూపాయల చొప్పున ఒక వంద కుటుంబాలకి విరాళంగా ఇచ్చాడు. ఇక కరోనా సమయంలో కూడా చాలామంది మధ్య తరగతి కుటుంబానికి తన వంతు సహాయం అందిస్తూ ఫుడ్ లేనివారికి ఫుడ్ ని అరేంజ్ చేస్తూ, సానిటైజర్లు, మాస్క్ లను కూడా పంపిణీ చేశాడు…ఇక మొత్తానికైతే ఇవాళ్ళ బర్త్ డే జరుపుకుంటున్న విజయ్ దేవరకొండ ఈ సంవత్సరంలో భారీ సక్సెస్ లను అందుకొని స్టార్ హీరో రేంజ్ కి వెళ్ళాలని కోరుకుందాం…