Homeఎంటర్టైన్మెంట్Avengers Doomsday : ఎవెంజర్స్ - ధూమ్స్ డే' ట్రైలర్ రివ్యూ: థానోస్ ని మించినోడు...

Avengers Doomsday : ఎవెంజర్స్ – ధూమ్స్ డే’ ట్రైలర్ రివ్యూ: థానోస్ ని మించినోడు వచ్చేశాడు..ఇక విధ్వంసమే..

Avengers Doomsday : ప్రపంచవ్యాప్తంగా ‘మార్వెల్ స్టూడియోస్’ సంస్థ నుండి వచ్చే సినిమాలకు , ముఖ్యంగా ఎవెంజర్స్ సిరీస్ నుండి వచ్చే సినిమాలకు ఏ రేంజ్ క్రేజ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సిరీస్ కి మన ఇండియన్స్ లో కూడా వేరే లెవెల్ క్రేజ్ ఉంది. మన ఇండియన్ సూపర్ స్టార్స్ కి ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ఓపెనింగ్స్ వస్తాయో, ఈ సిరీస్ కి కూడా అదే రేంజ్ ఓపెనింగ్స్ వస్తుంటాయి. […]

Avengers Doomsday : ప్రపంచవ్యాప్తంగా ‘మార్వెల్ స్టూడియోస్’ సంస్థ నుండి వచ్చే సినిమాలకు , ముఖ్యంగా ఎవెంజర్స్ సిరీస్ నుండి వచ్చే సినిమాలకు ఏ రేంజ్ క్రేజ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సిరీస్ కి మన ఇండియన్స్ లో కూడా వేరే లెవెల్ క్రేజ్ ఉంది. మన ఇండియన్ సూపర్ స్టార్స్ కి ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ఓపెనింగ్స్ వస్తాయో, ఈ సిరీస్ కి కూడా అదే రేంజ్ ఓపెనింగ్స్ వస్తుంటాయి. ఈ సిరీస్ నుండి రాబోతున్న తదుపరి చిత్రం ‘ఎవెంజర్స్ : ధూమ్స్ డే’. ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ 18 న విడుదల చేయబోతున్నట్టు , ఆ చిత్ర నిర్మాతలు నేడు థియేట్రికల్ ట్రైలర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. ఈ ట్రైలర్ కి ఆడియన్స్ నుండి గూస్ బంప్స్ రెస్పాన్స్ వచ్చింది.

ఈ ట్రైలర్ ఆరంభం లో డాక్టర్ ధూమ్ ని చూస్తే ‘ఎవెంజర్స్ ఎండ్ గేమ్ ‘ లో థానోస్ ని మించినోడు అనే ఫీలింగ్ కలిగింది. అతనితో యుద్ధం చేయడానికి ‘థోర్’ ఎంతో కష్టపడడం ని చూస్తుంటే , ఈ సినిమాలో వీళ్లిద్దరి మధ్య భీకర పోరు ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ ట్రైలర్ లో ‘థోర్ ‘, ‘యాంట్ మ్యాన్’, ‘కెప్టెన్ మార్వెల్’ లతో పాటు హల్క్ ని కూడా చూపిస్తారు. ఇక మిగిలిన సూపర్ హీరోస్ కూడా ఇందులో ఉన్నారు కానీ , కెప్టెన్ అమెరికా , స్పై డర్ మ్యాన్ , ఐరన్ మ్యాన్ లు మాత్రం లేరు. కెప్టెన్ అమెరికా తన ఆయుధాన్ని త్యాగం చేసి, వృధాప్యం ని స్వీకరించి ఈ యూనివర్స్ నుండి తప్పుకున్నట్టు ‘ఎవెంజర్స్ : ఎండ్ గేమ్’ లోనే చూపిస్తారు. కాబట్టి ఆయన క్యారెక్టర్ కి ఎండ్ కార్డు పడినట్టే.

ఇక ఐరన్ మ్యాన్ కూడా చనిపోయినట్టు చూపిస్తారు కాబట్టి, ఈయన క్యారెక్టర్ కూడా సినిమాలో ఉండే అవకాశం లేదు. కానీ ఒక్క సన్నివేశం లో మాత్రం ఆయన పాత్ర కనిపిస్తుందని టాక్, అదే జరిగితే వరల్డ్ బాక్స్ ఆఫీస్ షేక్ అవుతుంది అనే చెప్పాలి. ఇక ఎవెంజర్స్ లో యాక్టీవ్ ఉండే స్పై డర్ మ్యాన్ ఈ ట్రైలర్ లో కనిపించకపోవడం గమనార్హం. అసలు ఆయన క్యారెక్టర్ ఇందులో ఉంటుందా లేదా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇకపోతే సోషల్ మీడియా ని ఒక రేంజ్ లో ఊపేస్తున్న ఈ సినిమా ట్రైలర్ ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper