Homeతెలంగాణ బ్రేకింగ్ న్యూస్ఆటో-లారీ ఢీ, ఇద్దరు మహిళలు మృతి

ఆటో-లారీ ఢీ, ఇద్దరు మహిళలు మృతి

తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలోని సదాశివనగర్ మండలం పద్మాజివాడి ఎక్స్ రోడ్ లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోను ఆటోను లారీ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారంతా తాడ్వాయి మండలం సంగోజివాడి గ్రామస్తులుగా గుర్తించారు. నిజామాబాద్ కులాస్ పూర్ లో అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Exit mobile version