
కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ ఇన్నాళ్లు ప్రజలు, ఉద్యోగులు, పరిశ్రమలు, ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపింది. అందరి ఆదాయాలు పోయి జనం, వ్యాపారులు దెబ్బతిన్నారు. అయితే మొదటి వేవ్ ను బాగానే కంట్రోల్ చేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రాలు రెండో వేవ్ కు వచ్చేసరికి తేలిపోయాయి.అదే ఇప్పుడు ఈ పార్టీల కొంప ముంచేలా కనిపిస్తోంది.
అటు కేంద్రంలోని బీజేపీకి.. ఇటు తెలుగు రాష్ట్రాల్లోని సీఎంలు కేసీఆర్, జగన్ లు కరోనా సెకండ్ వేవ్ విషయంలో వైద్య ఆరోగ్య రంగంలో వచ్చిన పెను సంక్షోభాన్ని అరికట్టలేకపోతున్నారని.. ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీకి చెక్ పెట్టలేకపోతున్నారని విమర్శలు వస్తున్నాయి.
మొదటి వేవ్ ను లాక్ డౌన్ తో కంట్రోల్ చేసిన మోడీ సార్.. రెండో వేవ్ లో ఐదు రాష్ట్రాల ఎన్నికలు, ర్యాలీలు, కుంభమేళాతో పెరగడానికి కారణమయ్యారని విమర్శలు తెచ్చుకున్నారు. అందుకే అందరికంటే ఎక్కువ ఎఫెక్ట్ మోడీపై పడింది.
అందుకే ‘రిజైన్ మోడీ’ నినాదం సోషల్ మీడియాలో ప్రతిధ్వనిస్తోంది. ఇక కర్ణాటకలోని స్తానిక సంస్థల్లో బీజేపీ ఓడిపోవడం ఆ పార్టీకి శరాఘాతంగా మారింది. బెంగాల్ లోనూ బీజేపీ గెలవదన్న సంగతి కరోనా ఎఫెక్ట్ పడినట్టేనని అంటున్నారు.
ఇక ఏపీలో ఆరోగ్య వ్యవస్థ తలకిందులైంది. ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీ ఎక్కువైంది. తెలంగాణలోనూ అదే పరిస్థితి. ప్రైవేటు దోపిడీని అడ్డుకోవడం లేదని.. రేట్లు భారీగా పెంచేయడం కూడా ఏపీ సీఎం జగన్ కు మైనస్ గా మారింది. కేసీఆర్ కరోనాతో ఐసోలేషన్ ఉండడంతో ఇక్కడా పట్టించుకోవడం లేదు. మొత్తంగా సెకండ్ వేవ్ లో ప్రభుత్వాల వైఫల్యంపై జనాలు గుర్రుగా ఉన్నారు.