
గత రెండు రోజులుగా కరోనా వైరస్ కొత్త కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతుండటంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం ముందస్తుగా లాక్ డౌన్ ను పొడగించింది. అయితే, ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన ప్రదర్శనలు చేపట్టారు. పలు ప్రాంతాల్లో ఆందోళనలు విషమంగా మారాయి ఇప్పటి వరకు 218 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మెల్ బోర్న్ లో ఆందోళనకారుల దాడిలో ఆరుగురు పోలీసులు గాయపడ్డారు.