Atti Satyanarayana: జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యనేతపై వేటు వేసింది. రాజమండ్రి నగర నియోజకవర్గం జనసేన ఇంఛార్జి అత్తి సత్యనారాయణపై జనసేన వేటు వేసింది. థియేటర్ల బంద్ పిలుపు వెనుక ఉననారన్న వార్తల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే అత్తి సత్యనారాయణ పార్టీ సభ్యత్వం కూడా రద్దు చేసింది. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తో తాజా పరిణామాలపై చర్చించానన్న పవన్ కళ్యాణ్ ఆ వివరాలను తెలియజేశారు.