Shweta Basu Prasad Tragic Life Story: కెరియర్ ప్రారంభంలో చైల్డ్ ఆర్టిస్టుగా పలు సినిమాలలో నటించి ఆ తర్వాత హీరోయిన్ గా తొలి సినిమాతోనే ఫుల్ ఫాలోయింగ్ తెచ్చుకుంది. తెలుగుతోపాటు హిందీ భాషలో కూడా పలు సినిమాలలో నటించి ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. కానీ అనుకోకుండా వివాదాలలో చిక్కి తన కెరీర్ నాశనం చేసుకుంది. సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత చాలామంది ముద్దుగుమ్మలు అతి తక్కువ సమయంలోనే ఊహించని విధంగా కనుమరుగైపోతారు. వాళ్లు చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా ప్రేక్షకులకు ఎప్పటికీ ఆ సినిమాలతో గుర్తుండిపోతారు. ఆ తర్వాత కనుమరుగైపోయిన ముద్దుగుమ్మలు ఏదో ఒక సందర్భంలో లేదా సోషల్ మీడియాలోనూ ఎక్కడో ఒకచోట దర్శనం ఇస్తారు. ఈ ముద్దుగుమ్మలు అప్పటికి ఇప్పటికీ గుర్తుపట్టలేని విధంగా మారిపోయి అభిమానులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తారు. అలా అతి తక్కువ సమయంలో సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా స్టార్ డం తెచ్చుకొని ఆ తర్వాత సడన్గా సినిమా ఇండస్ట్రీలో కనిపించకుండా పోయిన హీరోయిన్లలో ఈ హీరోయిన్ కూడా ఒకరు. ఈమె అతి చిన్న వయసులోనే తన కెరియర్ బాగా పీక్ లో చూసింది.
Also Read: Pawan Kalyan : టికెట్ రేట్స్ విషయంలో ఇక నుండి నా సినిమా అయినా సరే ఉపేక్షించేది లేదు- పవన్ కళ్యాణ్
బాగా స్టార్డం ఉన్న సమయంలోనే ఊహించని విధంగా ఒక హోటల్లో పోలీసులకు చిక్కి వివాదాలలో ఇరుక్కుంది. ఈమె హిందీ తో పాటు పలు తెలుగు సినిమాలలో కూడా నటించి బాగా గుర్తింపు తెచ్చుకుంది. కానీ అనుకోని వివాదాలతో ఆమె సినిమా కెరియర్ నాశనం అయిపోయింది. 17 ఏళ్ల అతి చిన్న వయసులో సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా స్టార్ డం సంపాదించుకుంది. కానీ 23 ఏళ్లకే వివాదాలలో చిక్కి ఊహించని విధంగా కెరీర్ నాశనం అయ్యింది. ఈ హీరోయిన్ మరెవరో కాదు శ్వేతా బసు ప్రసాద్. శ్వేతా బసు ప్రసాద్ హిందీ సినిమా మక్తి లో చైల్డ్ ఆర్టిస్టుగా బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి పరిచయమయ్యింది.
కహాని ఘర్ ఘర్ కి అనే బుల్లితెర టీవీ సీరియల్ తో బాగా ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత అతి చిన్న వయసులోనే హీరోయిన్ గా టాలీవుడ్ లో కొత్త బంగారులోకం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా మంచి విజయం సాధించింది. తనదైన నటనతో శ్వేతాబసు ప్రసాద్ ఈ సినిమాలో యూత్ ను అట్రాక్ట్ చేసింది. తొలి సినిమాతోనే కుర్రాళ్ళ మనసులో స్థానం సంపాదించుకుంది. ఈ సినిమా హిట్ తర్వాత తెలుగులో ఒకటి రెండు సినిమాలలో కనిపించింది. స్టార్ హీరోయిన్గా ఎదుగుతుంది అని అందరూ అనుకునే లోగా అనుకోకుండా ఒక హోటల్లో పోలీసులకు చిక్కి కెరియర్ నాశనం చేసుకుంది.
View this post on Instagram