
నెల్లూరు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కన్న తండ్రి చేతిలో నే మరో చిన్నారి హతమైంది. మొన్న మనుబోలులో తల్లిదండ్రుల చేతిలో ఇద్దరు చిన్నారులు హతమవ్వగా ఈరోజు తండ్రి చేతిలో మరో చిన్నారి బలి అయ్యింది. ఓజిలి మండలం బట్టలకనుపురులో 15 నెలల చిన్నారిని తండ్రి మధు చెరువులో పడేసి కడతేర్చాడు. మద్యం మత్తులో చిన్నారిని తండ్రి హతమార్చినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.