మోడీపై యోగిదే పైచేయా?

ఉత్తరప్రదేశ్ లో రాజకీయాలు మారుతున్నాయి. స్థానిక ఎన్నికల్లో ఓటమి తరువాత కరోనా లాక్ డౌన్ లో ఏమీ చేయలేదన్న విమర్శలతో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పై ఆ రాష్రంలో వ్యతిరేకత పెల్లుబికిందన్న టాక్ ఉంది. దీతో సందట్లే సడేమియాలో యోగిని తప్పించాలని ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాలు ప్రయత్నించారని వార్తలు వచ్చాయి. ఈ మధ్య యోగిని ఢిల్లీకి కూడా అందుకే పిలిపించారు. ఉత్తరప్రదేశ్ లో సీఎం యోగి ఆదిత్యనాథ్ తోపాటు కేబినెట్ […]

Written By: Srinivas, Updated On : June 21, 2021 2:15 pm
Follow us on

ఉత్తరప్రదేశ్ లో రాజకీయాలు మారుతున్నాయి. స్థానిక ఎన్నికల్లో ఓటమి తరువాత కరోనా లాక్ డౌన్ లో ఏమీ చేయలేదన్న విమర్శలతో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పై ఆ రాష్రంలో వ్యతిరేకత పెల్లుబికిందన్న టాక్ ఉంది. దీతో సందట్లే సడేమియాలో యోగిని తప్పించాలని ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాలు ప్రయత్నించారని వార్తలు వచ్చాయి. ఈ మధ్య యోగిని ఢిల్లీకి కూడా అందుకే పిలిపించారు.

ఉత్తరప్రదేశ్ లో సీఎం యోగి ఆదిత్యనాథ్ తోపాటు కేబినెట్ మార్పు చేయాలని మోడీ, అమిత్ షా భావించారు. మోడీపై దేశంలో వ్యతిరేకత పెల్లుబికితే ప్రత్యామ్నాయంగా యోగిని ప్రధానిని చేయాలని ఆర్ఎస్ఎస్ సహా బీజేపీ ఆలోచిస్తోందన్న ప్రచారం సాగింది. దీంతో మోడీ, అమిత్ షాలు ఎలాగైనా సరే యోగిని తొక్కేయాలని ప్లాన్ చేస్తారని అంతా భావించారు.

గతంలో మోడీ వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన ఏకే శర్మను యూపీలో ఎమ్మెల్సీని చేశారు ప్రధాని మోడీ. ఈ క్రమంలోనే అతడిని డిప్యూటీ సీఎం పోస్టు ఇచ్చి యోగి ప్రాధాన్యత తగ్గించాలని చూశాడన్న ప్రచారం సాగింది. యూపీ రాజకీయాల్లో యోగికి చెక్ పెట్టేందుకు ప్రోత్సహించినా యోగి మాత్రం ఏకే శర్మను పక్కన పెట్టారు. ఆర్ఎస్ఎస్ ఏకంగా ఏకే శర్మ యూపీ బీజేపీ ఉపాధ్యక్షుడిగా నియమించి మోడీ షాలకు షాక్ ఇచ్చింది.

పరోక్షంగా యోగికి చెక్ పెట్టాలన్న నరేంద్ర మోడీ, అమిత్ షాలకు ఆర్ఎస్ఎస్ యోగి కలిసి చెక్ పెట్టారన్న ప్రచారం యూపీ వర్గాల్లో సాగుతోంది. వచ్చే ఏడాది జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇక యోగిదే హవా. నరేంద్ర మోడీ, అమిత్ షాలను ఈ నిర్ణయంతో పక్కనపెట్టినట్టే అనిపిస్తోంది.