
కరోనా సెకండ్ వేవ్ తో పోరాడుతున్న భారత్ కు సాయం అందించేందుకు ఐక్యరాజ్య సమితి ముందుకు వచ్చింది. యూఎన్ కు చెందిన సమీకృత సప్లయ్ చైన్ ద్వారా సాయం చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు యూఎన్ సెక్రెటరీ జనరల్ ఆటోనియో గుటెర్రస్ తెలిపారు. భారత్ లోని పరిస్థితులపై ఐక్యరాజ్య సమితి అధికారులు, భారత్ లో అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారని ఐక్యరాజ్య సమితి చీఫ్ డెప్యూటీ ప్రతినిధి ఫర్హాన్ హక్ తెలిపారు.