https://oktelugu.com/

మెగాస్టార్ ‘లూసిఫర్’కి మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్ !

దర్శకుడు వినాయక్ డైరెక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘లూసిఫర్’ రిమేక్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకుంటున్నారు. ఆ రకంగా ఖైదీ 150 కలయిక మళ్ళీ కలవబోతుంది. అయితే దేవి సంగీతంలో ఇదివరకటి శబ్దం లేదు, ఆ మాటకొస్తే..గత కొన్ని సినిమాలుగా దేవి తన ప్రభావాన్ని వైభవాన్ని కోల్పోతున్నాడు. నిజానికి కోల్పోతున్నాడు అనడం కంటే, తమన్ ఫుల్ ఫామ్ లోకి వచ్చి.. దేవి […]

Written By:
  • admin
  • , Updated On : September 25, 2020 / 06:18 PM IST
    Follow us on


    దర్శకుడు వినాయక్ డైరెక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘లూసిఫర్’ రిమేక్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకుంటున్నారు. ఆ రకంగా ఖైదీ 150 కలయిక మళ్ళీ కలవబోతుంది. అయితే దేవి సంగీతంలో ఇదివరకటి శబ్దం లేదు, ఆ మాటకొస్తే..గత కొన్ని సినిమాలుగా దేవి తన ప్రభావాన్ని వైభవాన్ని కోల్పోతున్నాడు. నిజానికి కోల్పోతున్నాడు అనడం కంటే, తమన్ ఫుల్ ఫామ్ లోకి వచ్చి.. దేవి స్థానాన్ని ఎగరేసుకుపోతున్నాడు అనడమే కరెక్ట్. మరి ఇలాంటి స్థితిలో ఉన్న దేవికి మెగాస్టార్ పిలిచి మరీ అవకాశం ఇవ్వడం నిజంగా విశేషమే. ఈ మధ్యన ఏ స్టార్ హీరో పిలిచి దేవికి చాన్స్ ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. దానికి తగ్గట్టే దేవి మ్యూజిక్ కూడా పెద్దగా హిట్ అవ్వట్లేదు.

    Also Read: బిగ్ బాస్-4లో మరో వైల్డ్ కార్డు ఎంట్రీ.. హాట్ హీరోయిన్ ఎంట్రీ?

    అయితే ఒక మ్యూజిక్ డైరెక్టర్ గా దేవి టాలెంట్ ను తక్కువ చేయలేం. గతంలో బ్రహ్మాండమైన సంగీతం అందించిన దేవి శ్రీ ఈ మధ్య ఆ స్థాయిలో మ్యూజిక్ ఇవ్వలేకపోవచ్చు. దేవి వరుస స్టార్ హీరోల సినిమాలు చేయడం, అంచనాలు కూడా సినిమా సినిమాకి పెరిగిపోతుండటంతో ఎక్కువ టైం పెట్టడంలో దేవి విఫలమై మొత్తానికి తన నుండి సూపర్ హిట్ ఆల్బమ్ రాలేదు. కానీ ప్రస్తుతం కరోనా కారణంగా దేవికి కావల్సినంత ఫ్రీ టైం దొరికింది. ఇప్పుడు కచ్చితంగా దేవి నుండి ఇండస్ట్రీ హిట్ ఆల్బమ్ వస్తోందనే నమ్మకంతో ఉన్నారు హీరోలు, దర్శకులు. ఎంతైనా దేవి అంటేనే ఎనర్జీ.. కీరవాణి, మణిశర్మ లాంటి మెలోడీ బ్రహ్మల జమానాలో కూడా, తనకంటూ ఓ పత్యేకమైన బాణిని సృష్టించుకున్న ఏకైక వ్యక్తీ దేవి శ్రీ ప్రసాద్.

    Also Read: కోరిక తీరకుండానే చనిపోయిన ఎస్పీ బాలు

    మరి సంగీతంలో అంత గొప్ప అద్భుత నైపుణ్యం ఉన్న దేవి.. ఒకప్పటిలానే వరుస హిట్స్ తో టాలీవుడ్ కే ఏకైక సంగీత సంచలనంగా ఒక వెలుగు వెలిగాలని కోరుకుందాం. ప్రస్తుతం బన్నీ ‘పుష్ప’ సినిమాకి దేవి పని చేస్తున్నాడు. పుష్ప మ్యూజిక్ ఓ రేంజ్ లో ఉండబోతుందని.. దేవి ఈ సారి సాంగ్స్ తో అదరగొట్టేశాడని.. ఇప్పటికే పుష్ప కోసం నాలుగు సాంగ్స్ ను పూర్తి చేశాడని, సాంగ్స్ అన్నీ ఆల్ టైం హిట్స్ గా నిలిచిపోయేలా ఉన్నాయని పుష్ప ఆల్బమ్ గురించి ఇండస్ట్రీలో వినిపిస్తోన్న టాక్. అన్నిటికీ మించి దేవి అంటేనే అదిరిపోయే ఐటమ్ సాంగ్ ఉంటుంది. పుష్పలో కూడా అలాంటి సాంగ్ ఒకటి ఉండబోతుందట.