India vs Pakistan ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ జట్టుకు టీమిండియా సారధి సూర్య కుమార్ యాదవ్ షాక్ ఇచ్చాడు. మామూలుగా కాదు.. దెబ్బకు పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ దిగ్బ్రాంతికి గురయ్యాడు. ఆ తర్వాత అలా చూస్తూ ఉండిపోయాడు. తట్టుకోలేక చివరికి ఒక్కడే మైదానంలో ట్రోఫీ పక్కన నిలబడి ఫోటోలకు ఫోజు ఇచ్చాడు.
ఆసియా కప్ ఫైనల్లో భాగంగా టీమిండియా, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. వాస్తవానికి ఫైనల్ మ్యాచ్ ముందు ట్రోఫీ పక్కన రెండు జట్ల సారధులు ఫోటోలు దిగుతారు. ఇది ఎప్పటి నుంచో వస్తున్న సంప్రదాయం. కానీ ఈ సాంప్రదాయానికి టీం ఇండియా సారధి సూర్య కుమార్ యాదవ్ చరమగీతం పాడాడు. పహల్గామ్ దాడి.. ఆ తర్వాత జరిగిన ఆపరేషన్ సిందూర్ వంటి పరిణామాలతో టీమిండియా సారథి భిన్నంగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే లీగ్ మ్యాచ్లో గెలిచిన తర్వాత టీమిండియా సారధి సూర్య కుమార్ యాదవ్ పాకిస్తాన్ ప్లేయర్లకు కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు. సూపర్ ఫోర్ మ్యాచ్లో గెలిచిన తర్వాత కూడా టీమ్ ఇండియా ప్లేయర్లు పాకిస్తాన్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు. లీగ్ మ్యాచ్లో టీమిండియా సారథి సూర్య కుమార్ యాదవ్ షేక్ అండ్ ఇవ్వకపోవడంతో పెద్ద రచ్చ జరిగింది. దీనిపై ఏకంగా పాకిస్తాన్ జట్టు ఐసిసికి ఫిర్యాదు చేసింది. మ్యాచ్ రిఫరీ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఇన్ని పరిణామాలు జరిగినప్పటికీ టీమిండియా ఏ మాత్రం తగ్గలేదు. ఐసీసీ కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు.
సూపర్ 4 మ్యాచ్ లో టీమిండియా చేజింగ్ చేస్తున్న సమయంలో పాకిస్తాన్ బౌలర్లు భారత బ్యాటర్ల మీదికి దూసుకుపోయారు. అడ్డగోలుగా మాట్లాడారు. వారికి అదే విధంగా భారత బ్యాటర్లు సమాధానం చెప్పారు. అంతకుముందు పాకిస్తాన్ ఇన్నింగ్స్ సమయంలో పాకిస్తాన్ ఆటగాడు గన్ ఫైరింగ్ సెలబ్రేషన్ చేసుకున్నాడు. ఇవన్నీ కూడా టీం ఇండియా ప్లేయర్లలో ఆగ్రహాన్ని కలిగించాయి. అందువల్లే టీమిండియా సారథి సూర్య కుమార్ యాదవ్ పాకిస్తాన్ కెప్టెన్ తో ఫోటో దిగడానికి ముందుకు రాలేదని తెలుస్తోంది. అంతేకాదు సూర్యకుమార్ యాదవ్ ఒక్కడే ట్రోఫీ పక్కన నిలబడి ఫోటో దిగినట్టు తెలుస్తోంది.