
టీడీపీ నేత, మాజీ కేంద్రమంత్రి, మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ అశోక్ గజపతిరాజు పిటిషన్ పై మంగళవారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ తన ఆదేశాలు పాటించడం లేదని అశోక్ గజపతిరాజు పిటిషన్ వేశారు. దీనిపై న్యాయస్థానం విచారణ జరిపింది. ట్రస్ట్ సిబ్బంది జీతాలు వెంటనే వెంటనే చెల్లించాలని ఆదేశించింది. ట్రస్ట్ అకౌంట్స్ సీజ్ చేయాలంటూ ఈవో ఇచ్చిన ఆదేశాలను న్యాయస్థానం సస్పెండ్ చేసింది. ట్రస్ట్ కింద ఉన్న ఇన్ స్టిట్యూషన్స్ వ్యవహారంలో జోక్యంవద్దని ఈవోకు ఆదేశించింది. స్టేట్ ఆడిట్ అధికారులు ఆడిట్ చేసుకోవచ్చని స్పష్టంచేసింది. పాలకమండలి ఏర్పాటు జీవో 75పై కౌంటర్ వేయాలని హైకోర్టు ఆదేశించింది. జిల్లా ఆడిట్ అధికారి మాత్రమే ఆడిట్ చేయాలని హైకోర్టు ఆదేశిస్తూ మాన్సాస్ ట్రస్ట్ ఈవోకు నోటీసులు జారీ చేసింది.