ఆంధ్రా- ఒడిశా సరిహద్దు (ఏవోబీ) లో ఆరుగురు కీలక మావోయిస్టులను విశాక జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో మావోయిస్టు అగ్రనేత ఆర్కే గన్ మెన్లు కూడా ఉన్నట్లు సమాచారం. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమును హతమార్చిన వారు కూడా అరెస్టయిన వారిలో ఉన్నట్లు తెలుస్తోంది. మావోయిస్టుల అరెస్టుపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించనున్నారు.