నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. భారత ప్రభుత్వ రంగ సంస్థలలో ఒకటైన ఈ సంస్థ అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నిరుద్యోగ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 675 ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని తెలుస్తోంది. మెకానిక్, వెల్డర్, టర్నర్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్ ఉద్యోగ ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరుతుందని సమాచారం. ఆగష్టు నెల 16వ తేదీ నుంచి ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేయవచ్చు. ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికవుతారో వాళ్లకు సంవత్సరం పాటు శిక్షణ ఇస్తారు. https://www.nlcindia.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
14 సంవత్సరాల వయస్సు పైబడిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అకడమిక్ మార్కుల ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఆగష్టు 25వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు 2021 సంవత్సరం ఆగష్టు 30వ తేదీలోగా దరఖాస్తు హార్డ్ కాపీలను పంపాల్సి ఉంటుంది.
వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని సమాచారం. ఐటీఐ, బీకామ్, బీబీఏ, బీసీఏ, బీఎస్సీ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిట్టర్, మెకానిక్, ఎలక్ట్రీషియన్, వైర్ మెన్, అకౌంటెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, హెచ్‌ఆర్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి.