
యు.కెం. ఫిలింస్ పతాకంపై ఉషారాణి కనుమూరి, విజయ రామకృష్ణంరాజు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం అప్పుడు ఇప్పుడు. సుజన్, తనీష్క్ హీరోహీరోయిన్లుగా దర్శకుడు చలపతి పువ్వుల సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు పద్మనవ్ భరద్వాజ్ స్వరాలు సమకూర్చారు. అయితే ఈ సినిమా తేదీని చిత్రం బృందం ప్రకటించింది. సెప్టెంబర్ 3న విడుదల చేస్తామని తెలిపింది.