https://oktelugu.com/

ఏపీపీఎస్సీ సంచలన నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ ) సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఏపీపీఎస్సీ నిర్వహించే పరీక్షలకు ప్రిలిమ్స్ రద్దు చేస్తున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. గ్రూప్ -1 పోస్టులకు మాత్రం ఈ ప్రిలిమ్స్ పరీక్షలు నిర్వహిస్తామంది. ప్రిలిమ్స్ పరీక్ష రద్దుకు సంబంధించిన జీవోలు 39,  150ను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పింది. గ్రూప్-1 ఇంటర్వ్యూల స్థానంలో వేరే విధానం అమలుకు చర్యలు చేపట్టనున్నామని, కొత్త నోటిఫికేషన్లు ఆగస్టులో విడుదలకానున్నాయని ఏపీపీఎస్సీ తెలిపింది. 1,184 పోస్టులకు త్వరలో […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : July 16, 2021 / 04:55 PM IST
    Follow us on

    ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ ) సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఏపీపీఎస్సీ నిర్వహించే పరీక్షలకు ప్రిలిమ్స్ రద్దు చేస్తున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. గ్రూప్ -1 పోస్టులకు మాత్రం ఈ ప్రిలిమ్స్ పరీక్షలు నిర్వహిస్తామంది. ప్రిలిమ్స్ పరీక్ష రద్దుకు సంబంధించిన జీవోలు 39,  150ను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పింది. గ్రూప్-1 ఇంటర్వ్యూల స్థానంలో వేరే విధానం అమలుకు చర్యలు చేపట్టనున్నామని, కొత్త నోటిఫికేషన్లు ఆగస్టులో విడుదలకానున్నాయని ఏపీపీఎస్సీ తెలిపింది. 1,184 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తామంది.