https://oktelugu.com/

షణ్ముఖ్ జశ్వంత్ అంత సంపాదిస్తున్నాడా?

షణ్ముక్ జశ్వంత్ పేరు తెలియని వారుండరు. మనోడు వెబ్ సిరీస్ లతోనే భారీ స్థాయిలో క్రేజ్ అందుకున్నాడు ఇప్పుడు బుల్లితెరపై కూడా మంచి నటుడిగా కొనసాగుతున్నాడు. సోషల్ మీడియాలో కూడా తన ప్రభావం పెరిగిపోతోంది. అతడి రెమ్యూనరేషన్ కూడా భారీగానే ఉంటోంది. దీంతో షణ్ముఖ్ జశ్వంత్ అనగానే సోషల్ మీడియా జనాలకు సంభాషణలు గుర్తొస్తుంటాయి. వైవా షార్ట్ ఫిల్మ్ నుంచి యూ ట్యూబ్ కంటెంట్ తో ఆకట్టుకుంటున్నాడు. షన్ను అనే పేరుతో ఎక్కువగా వైరల్ అయ్యే ఈ […]

Written By:
  • Srinivas
  • , Updated On : July 16, 2021 / 04:58 PM IST
    Follow us on

    షణ్ముక్ జశ్వంత్ పేరు తెలియని వారుండరు. మనోడు వెబ్ సిరీస్ లతోనే భారీ స్థాయిలో క్రేజ్ అందుకున్నాడు ఇప్పుడు బుల్లితెరపై కూడా మంచి నటుడిగా కొనసాగుతున్నాడు. సోషల్ మీడియాలో కూడా తన ప్రభావం పెరిగిపోతోంది. అతడి రెమ్యూనరేషన్ కూడా భారీగానే ఉంటోంది. దీంతో షణ్ముఖ్ జశ్వంత్ అనగానే సోషల్ మీడియా జనాలకు సంభాషణలు గుర్తొస్తుంటాయి. వైవా షార్ట్ ఫిల్మ్ నుంచి యూ ట్యూబ్ కంటెంట్ తో ఆకట్టుకుంటున్నాడు.

    షన్ను అనే పేరుతో ఎక్కువగా వైరల్ అయ్యే ఈ టాలెంటెడ్ స్టార్ సోషల్ మీడియాలో కూడా భారీ స్థాయిలో అనుచరులను సంపాదించుకున్నాడు. ఇక పర్సనల్ విషయాలు ఇంటర్నెట్ వరల్డ్ లో బాగానే వైరల్ అవుతున్నాయి. ఇక షణ్ముఖ్ యూ ట్యూబ్ ఆదాయం గురించి కూడా రకరకాల రూమర్స్ వస్తున్నాయి. షణ్ముఖ్ తన గమనంలో ఇంకా ముందుకు వెళ్లాలని ఆశిస్తున్నారు.

    ఇటీవల షణ్ముఖ్ ఒక ఖరీదైన కారును కొనుగోలు చేసుకుని దానితో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇక అతని ఫ్యాన్స్ కంగ్రాట్స్ తెలిపినా కొందరు మాత్రం అదే పనిగా ట్రోల్ చేస్తున్నారు. గతంలో షణ్ముఖ్ ఒక యాక్సిడెంట్ ఘటనతో విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఇక కారు ఫొటో పోస్ట్ చేస్తున్నాడు. డ్రైవింగ్ లో జాగ్రత్తగా చూసుకోవాలని సూచిస్తున్నారు.

    ఇక నుంచి కాస్త జాగ్రత్తగా కారు నడుపు, తాగకుండా డ్రైవ్ చేయమని కొందరు నెటిజన్లు సలహాలు ఇస్తున్నారు. ఇక కారు నెంబర్ ప్లేట్ కనిపించకుండా బ్లర్ చేయడంపై కూడా ఓ వర్గం వారు విమర్శలు చేస్తుండడం వైరల్ అవుతోంది. నెటిజన్ ల కామెంట్స్ ఏ మాత్రం పట్టించుకోకుండా షణ్ముఖ్  ముందుకు వెళుతున్నాడు.

    షణ్ముఖ్ ఇటీవల సూర్య వెబ్ సిరీస్ ద్వారా మంచి క్రేజ్ అందుకున్నాడు. తన యూ ట్యూబ్ చానల్ కు 3 మిలియన్స్, పైగా సబ్ స్కైబర్స్ కూడా ఉన్నారు. ఇక ఎలాంటి వీడియో పోస్ట్ చేసిన కూడా ఈజీగా 10 మిలియన్ల వ్యూవ్స్ వస్తున్నాయి. ఇక ఆదాయం కూడా నెలకు 8 నుంచి 10 లక్షల మధ్యలో వస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు సినిమా స్టార్స్ రేంజ్ లోనే పన్ను ఏఢాదికి కోటికి పైగా ఆదాయాన్ని అందుకుంటున్నట్లు సమాచారం.