
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత తృణమూల్ కాంగ్రెస్ ఇప్పుడు దృష్టి పెట్టింది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన మేనల్లుడు ఎంపీ అభిషేక్ బెనర్జీ స్థాయిని మరింత పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అభిషేక్ బెనర్జీని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించడం ద్వారా అతనికి పెద్ద బాధ్యత అప్పగించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనంతరం మమతా అధ్యక్షతన టీఎంసీ వర్కింగ్ కమిటీ మొదటి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.