
నేపాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేవ్ బా (74) ఐదోసారి ఆ దేశ ప్రధానమంత్రిగా నియమితులయ్యారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 76(5) మేరకు నేపాల్ రాష్ట్రపతి విద్యాదేవి భండారీ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రమాణ స్వీకారం ఎప్పడు చేస్తారనే వివరాలను మాత్రం వెల్లడించలేదు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన 30 రోజుల్లో దేవ్ బా పార్లమెంట్ లో తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది.