
పాలిటెక్నిక్ కళాశాలల ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఫలితాలను మంత్రి గౌతంరెడ్డి విడుదల చేశారు. ఈ ఏడాది పాలిసెట్ కు 74,884 మంది దరఖాస్తు చేయగా 68,208 మంది పరీక్షకు హాజరవగా, 64,187 మంది ఉత్తీర్ణత సాధించారు. విశాఖ జిల్లాకు చెందిన రోషన్ లాల్, ప.గో జిల్లాకు చెందిన విష్ణువర్ధన్ మొదటి ర్యాంక్ సాధించారు.