Bigg Boss 5 Telugu: ప్రేక్షకుల్ని టీ. వి ల కి కట్టి పడేసేలా ఒక్కొక్క హౌస్ మేట్ తమ వింత ప్రదర్శన తో అలరిస్తున్నారు. మరి ముఖ్యం గా ఒక హౌస్ మేట్ కి చంద్రముఖి పూనితే ఇంకొక హౌస్ మేట్ కి అర్జున్ రెడ్డి పునుతున్నాడు. మరి పూనకం పట్టిన హౌస్ మేట్స్ కి ఆస్కార్ అవార్డ్ లు ఖాయమంటరా..? అవుననే అంటున్నారు ప్రేక్షకులు.
పూనకం పట్టిన బ్యాచ్ లల్లో మొట్ట మొదటి గా వినిపించే పేరు లహరి. మొదటి వారం నుండి ఆమె ప్రదర్శన గమనిస్తే కారణం లేకుండ కావాలని పక్కనోల్ల మీద అంత పెద్ద నూరు వేసుకుని అరుస్తూ కనిపించింది. ఇదంతా చూసేసరికి జనాలు ఒక్కసారిగా అర్జున్ రెడ్డి సినిమానే గుర్తు తెచ్చుకున్నారు.
మరొక ఇంటి సభ్యుడు భజన బ్యాచ్ కి అధ్యక్షుడు. బిగ్ బాస్ షో కి గేమ్ ఆడటం కంటే భజన చెయ్యడానికి వచ్చినట్టు ఉన్నాడు. ఆయన ఎవరో కాదు జస్వంత్ (జెస్సీ)పడాల. సిరి మీద పెట్టిన ధ్యాస ఏదో కాస్త గేమ్ మీద పెట్టి ఉంటే మొదటి వారం లో వీక్ కంటెస్టెంట్ అయ్యేవాడు కాదు…. జైళ్లో కి వెళ్ళేవాడు కాదు.
నేనేం తక్కువ తిన్నానా …? అందరి కంటే 3 ఆకులు ఎక్కువే చదివా అని ఉమా అత్త రోజు రాత్రి అయ్యేసరికి గొడవ మొదలు పెట్టి మళ్ళి సారి చెప్పి శాంత పడేది.
ఇంక సోమవారం జరిగిన నామినేషన్స్ ప్రక్రియ లో శ్వేతా వర్మ (Set Swetha ) అక్క కి ఏకం గా చంద్ర ముఖి పట్టింది. చెడా మడా అనాల్సినవి అనేసింది. కొట్టాలని అనుకుంది, అనుకున్నట్టు గానే హమీద మరియు లోబో చెంప చెళ్లుమనిపించింది మరియు కళ్ళల్లో రంగు పోసింది.
ఇంక నటరాజ్ మాస్టర్ గుంటనక్క – తోడేలు కథ రెండవ వారినికి జరిగిన నామినేషన్ల ఘట్టానికే హైలైట్ అయ్యింది. సందర్భం లేకపోయినా సృష్టించి మరి తగాదా మొదలు పెట్టి దానికి కామా లేకుండానే ఆపేస్తాడు.
ఆ ర్జే కాజల్ అయితే కంటెంట్ కోసం పరితపిస్తూ బిగ్ బాస్ హౌస్ లో అలా కాలాన్ని వెల్లదీస్తుంది లేదా కుదిరితే గొడవలు లేకపోతే మ్యారేజ్ బ్యూరో ని నడిపిస్తుంది.
ఇలా మొత్తానికి బిగ్ బాస్ హౌస్ మొత్తం పెర్ఫార్మెన్స్ తో అలరింప చేస్తుంది. చూసే ప్రేక్షకుడికి కూడా కనువిందు కలుగచేస్తుంది.