Venezuelan leader Nicolás Maduro : అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్.. వెనెజులా అధ్యక్షుడిగా ఉన్న నికోలస్ మదురోను సైనిక చర్యద్వారా అరెస్టు చేయించారు. ఒక దేశ అధ్యక్షుడిని అమెరికా సైన్యం ఆ దేశంలో చొరబడి అరెస్టు చేయడం సంచలనంగా మారింది. మదురోను అమెరికా సైనికులు ప్రత్యేక హెలిక్యాప్టర్‌లో అమెరికాకు తరలించారు. అయితే మదురో ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. అమెరికా సైనికులక హ్యాపీ న్యూ ఇయర్ అంటూ శుభాకాంక్షలు తెలిపారు.
కోర్టుకు మదురో..
ఇదిలా ఉండగా డ్రగ్స్, ఉగ్రవాద కుట్రలు, కొకైన్ దిగుమతి వంటి అభియోగాలను అమెరికా మదురోపై మోపింది. అతడిని న్యూయార్క్ ఫెడరల్ కోర్టులో హాజరు పర్చాలని నిర్ణయించారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు మొదటి విచారణ జరుగుతుందని అమెరికా ప్రకటించింది. ఈ ఘటన అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయమైంది.
మదురోపై మోపిన అభియోగాలు..
మాడురోపై డ్రగ్స్ అక్రమ రవాణా, నార్కో ఉగ్రవాద కుట్రలు, కొకైన్ దిగుమతి, ఆయుధాల ఉల్లంఘనతోపాటు అనేక కేసులు నమదు చేశారు. ఈ ఆరోపణలు అతని పాలనలో జరిగిన అనైతిక కార్యకలాపాలను బహిర్గతం చేస్తున్నాయి. విచారణ ఫలితాలు వెనెజువెలా రాజకీయాలపై గణనీయ ప్రభావం చూపుతాయి.
ఈ అరెస్టు అమెరికా విదేశాంగ విధానానికి కొత్త దిశను సూచిస్తోంది. మాదురో పాలనలో జరిగిన మానవ హక్కుల ఉల్లంఘనలు, ఆర్థిక కుంభకోణాలు కూడా విచారణలో తెరపైకి రావచ్చు. లాటిన్ అమెరికా దేశాల్లో ఈ సంఘటన తీవ్ర ప్రతిచర్యలకు దారితీస్తుంది.
COURT DATE SET: Venezuelan dictator Nicolás Maduro will be arraigned in federal court in New York City at 12 p.m. ET on Monday, authorities announced.
Maduro faces multiple charges, including narco-terrorism conspiracy, cocaine importation conspiracy, and weapons offenses… pic.twitter.com/J76bIKD7vO
— FEDERAL INVESTIGATION INTERNATIONAL (@internatio56662) January 4, 2026