
పర్యటనలో భాగంగా కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా తో ఆయన భేటి అయ్యారు. అమిత్ షా నివాసంలో సీఎం జగన్ ఆయన్ను కలిశారు. విభజన చట్టంలోని హామీల అమలు, పోలవరం, కోవిడ్ సహా రాష్ట్రానికి రావల్సిన పెండింగ్ నిధుల అంశాలను అమిత్ షాకు సీఎం వివరిస్తున్నట్లు సమాచారం . సీఎం జగన్ వెంట వైకపా ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఈ భేటి అనంతరం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ , కేంద్ర జలశక్తి శాఖ గజేంద్ర సింగ్ షెకావత్ తో సీఎం జగన్ సమావేశం కానున్నారు.