
కరోనా పరిస్థితులపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. డిప్యూటీ సీఎం ఆళ్లనాని అధ్యతన ఈ భేటీ జరుగుతోంది. కరోనా కట్టడి, బ్లాక్ ఫంగస్, ఆక్సిజన్ సరఫరాపై చర్చ జరపడంతో పాటు, బ్లాక్ ఫంగస్ మందులు ఇంజక్షన్ల కొరత లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై కేబినెట్ సబ్ కమిటీ చర్చ చేపట్టింది. సమావేశానికి మంత్రులు బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు హాజరయ్యారు.