
జల వివాదం నేపథ్యంలో కృష్ణా నది యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం నుంచి తెలంగాణ జెన్ కో విద్యుదుత్పత్తి చేస్తున్న నేపథ్యంలో ఏపీకి తీవ్ర నష్టం జరుగుతుందని కృష్టా నది యాజమాన్య బోర్డుకు ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన కేఆర్ఎంబీ శ్రీశైలం ఎడమగట్టు నుంచి విద్యుత్ ఉత్పత్తి ఆపాలని తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది. కృష్ణా బోర్డు రాసిన లేఖకు స్పందనగా తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎస్ సీ మురళీధర్ బోర్డు చైర్మన్ కు మరో లేఖ రాశారు. శ్రీశైలం జల విద్యుత్ ప్రాజెక్టు ప్రారంభించిన సమయంలో ప్లానింగ్ కమిషన్, కృష్ణా మొదటి ట్రైబ్యూనల్ పూర్తి స్థాయిలో విద్యుత్ వినియోగానికి అనుమతి ఇచ్చిందని పేర్కొన్నారు.