Jagan Government: జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో మరో షాక్

జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో మరో షాక్ తగిలింది. మాజీ అడ్వకేట్ జనరల్ దుమ్మాలపాటి శ్రీనివాస్, మరికొందరిపై ఇన్ సైడర్ ట్రేడింగ్, అవినీతి నిరోధక చట్టం కింద పెట్టిన కేసులను గురువారం హైకోర్టు కొట్టేసింది. దమ్మాలపాటి ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారంటూ అవినీతి చట్టం కింద ఆయనపై ఏపీ ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు స్టే ఇచ్చింది. దీంతో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఇటీవల ఈకేసు విచారణకు రాగా.. ఇన్ సైడర్ […]

Written By: Suresh, Updated On : September 2, 2021 1:43 pm
Follow us on

జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో మరో షాక్ తగిలింది. మాజీ అడ్వకేట్ జనరల్ దుమ్మాలపాటి శ్రీనివాస్, మరికొందరిపై ఇన్ సైడర్ ట్రేడింగ్, అవినీతి నిరోధక చట్టం కింద పెట్టిన కేసులను గురువారం హైకోర్టు కొట్టేసింది. దమ్మాలపాటి ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారంటూ అవినీతి చట్టం కింద ఆయనపై ఏపీ ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు స్టే ఇచ్చింది. దీంతో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఇటీవల ఈకేసు విచారణకు రాగా.. ఇన్ సైడర్ ట్రేడింగ్ అనేది ఎక్కడ జరగలేదని హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు సమర్థిస్తూ ఈ కేసును నెల రోజుల్లో విచారణ చేయాలని ఏపీ హైకోర్టును ఆదేశించింది.