
పారాలింపిక్స్ లో భారత్ కు మరో పతకం దక్కింది. షూటింగ్ లో సింగ్ రాజ్ అధానా కాంస్య పతకం గెలుచుకున్నాడు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎన్ హెచ్ 1 విభాగంలో 216.8 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచాడు. దీంతో పారాలింపిక్స్ లో భారత్ సాధించిన పతకాల సంఖ్య ఎనిమిదికి చేరింది.