
ఛత్తీస్గఢ్ లో మవోయిస్టుల చేతిలో ఎస్ ఐ మురళి తాతీ మరణించిన ఘటన మరువకముందే మరో అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ కనిపించకుండా పోయాడు. గత నాలుగు రోజులుగా ఏఎస్ ఐ క్రిస్టొఫర్ లక్రా ఆచూకీ లభించడం లేదని ఎస్పీ కవర్ధా తెలిపారు. లక్రా పండరిపని సీఏపీ క్యాంప్ లో విధులు నిర్వర్తిస్తున్నారని ఆయన ఈ నెల 21 నుంచి కనిపించడం లేదని చెప్పారు. చివరిసారిగా ఆయనను స్దానిక ఆటవీ ప్రాంతంలో చూశామని క్యాంప్ సమీపంలోని గ్రామస్థులు తెలిపారని వెల్లడించారు.