
రాష్ట్రంలో కొత్తగా మరో ఏడు మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కేబినేట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. మహమబూబాబాద్, జగిత్యాల, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, కొత్తగూడెం, మంచిర్యాల జిల్లాలో వీటిని అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన ట్వీట్ ద్వారా తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడక ముందు కేవలం నాలుగు మెడికల్ కాలేజీలే ఉన్నాయన్న కేటీఆర్… కేసీఆర్ ప్రభుత్వం లో 2014-18 మధ్య ఐదు కాలేజీలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. త్వరలో మరో ఏడు వైద్య కళాశాలలు అందుబాటులోకి రానున్నాయని ఆయన తెలిపారు.