Mahesh Babu career best performances : సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు కెరియర్ మొదట్లో మంచి సినిమాలను చేశాడు. రాఘవేంద్రరావు డైరెక్షన్లో ‘రాజకుమారుడు’ సినిమాతో ఇంట్రడ్యూస్ అయిన మహేష్ ఆ సినిమాలో తన నటన పరిణీతిని చూపించి చాలా గొప్ప నటుడు అవుతాడు అంటూ విమర్శకుల నుంచి ప్రశంసలను అందుకున్నాడు. ఇక గుణశేఖర్ తో చేసిన ఒక్కడు మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి మరో స్టార్ హీరో దొరికాడు అంటూ తన గురించి ప్రతి ఒక్కరు చెప్పుకునేలా చేశాడు.
ఆ తర్వాత పోకిరి, దూకుడు, బిజినెస్ మేన్ లాంటి సినిమాలతో వరుస బ్లాక్ బస్టర్లను సాధించిన ఆయన ప్రస్తుతం డిఫరెంట్ సినిమాలను చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాడు… ఇప్పటి వరకు చేసిన సినిమాలు అతనికి నటన పరంగా చాలా వరకు హెల్ప్ అయ్యాయి. ముఖ్యంగా కెరియర్ స్టార్టింగ్ లో చేసిన మురారి, నిజం లాంటి సినిమాలు మహేష్ కెపబులిటి ఏంటో ప్రేక్షకులకు తెలియజేశాయి.
ఇక కెరియర్ స్టార్టింగ్ లో చేసిన మురారి, నిజం సినిమాలు మహేష్ బాబు ను చాలా వరకు ఇబ్బంది పెట్టారట…అప్పటికే వాళ్లు స్టార్ డైరెక్టర్లు అవ్వడం మహేష్ బాబుకి ఆ టైమ్ లో పెద్దగా సక్సెసులు లేకపోవడం వల్ల వాళ్ళు చెప్పినట్టుగా వింటూ వచ్చారట. ఒకరకంగా మహేష్ బాబుకు కొన్ని సన్నివేశాలు చేయడం ఇష్టం లేకపోయిన వాళ్ళ ఫోర్స్ వల్ల చేయాల్సి వచ్చిందని తను తన సన్నిహితుల దగ్గర చాలా సందర్భాల్లో తెలియజేశాడట.
మొత్తానికైతే నిజం సినిమాలో మహేష్ బాబు అల్టిమేట్ యాక్టింగ్ చేశారని చాలా మంది చెబుతుంటారు. మురారి సినిమాలో క్యూట్ గా కనిపిస్తూ ఫన్ యాంగిల్ కూడా తనలో ఉందని ప్రేక్షకులకు తెలియజేశాడు. మొత్తానికైతే ఈ ఇద్దరు దర్శకుల వల్ల మహేష్ బాబు చాలా వరకు స్ట్రగుల్ అయినప్పటికి వాళ్ల వల్లే అతనికి మంచి క్రేజ్ దక్కింది…ప్రస్తుతం రాజమౌళి సైతం మహేష్ ను చాలా వరకు ఇబ్బంది పెడుతున్నట్టుగా తెలుస్తోంది…